Banner

TUWJ - IJU..TEMA జిల్లా కీలక కమిటీ ఎన్నిక

TUWJ - IJU..TEMA జిల్లా కీలక కమిటీ ఎన్నిక

తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ - IJU) అనుబంధ సంఘం అయిన తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోషియేషన్ (TEMA) నిజామాబాద్ జిల్లా కమిటీ కీలకమైన జిల్లా అధ్యక్షులుగా సుంకరి రాజేశ్వర్ @ రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. ధనుంజయ్, జిల్లా కోశాధికారిగా పి.అనిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. శనివారం టీఎన్జీవో భవన్, నిజామాబాద్ లో టీ.ఈ.ఎం.ఏ. జిల్లా సమావేశం జరిగింది. TUWJ - IJU జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ కొన్ని సంఘాలు తమ మనుగడ కోసం మన సంఘా సభ్యుల పేర్లను వారి కమిటీలో పెట్టీ, మన సంఘంలోని ఇతర సభ్యులను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు, సందర్భాలలో సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. అలాగే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా కమిటీలో జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా కోశాధికారితో పాటు జిల్లా ఉపాధ్యక్షులు - 3, జిల్లా సహాయ కార్యదర్శిలు - 3, జిల్లా కార్యవర్గ సభ్యులు - 4 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులలో జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో పని చేస్తున్న జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. జిల్లా అధ్యక్షులుగా సుంకరి రాజేశ్వర్ @ రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. ధనుంజయ్, జిల్లా కోశాధికారిగా పి. అనిల్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలో TEMA జిల్లా సర్వ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి కమిటీని ఎన్నిక చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, కోశాధికారి సిరిగద ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొబ్బిలి నర్సయ్య, ప్రమోద్ గౌడ్, ఎం.ఎ మాజీద్, ఐజెయు కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, తేమ మాజీ అధ్యక్షుడు శేఖర్, అక్రిడిటేశన్ కమిటీ సభ్యులు పాకాల నర్సింలు, వీడియో జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు రవిచరణ్ లతో పాటు 32 మంది సభ్యులు పాల్గొన్నారు...

Categories:

Calendar

Advertisements

Latest News