జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి... ఎడ్ల సంజీవ్, జిల్లా అధ్యక్షుడు, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం.. ----------- ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజెయు) పిలుపుమేరకు టియుడబ్ల్యుజె - ఐజెయు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం "జర్నలిస్టు మీడియా డే" సందర్భంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి భగత్ సింగ్ చౌరస్త వరకు ర్యాలీగా వెళ్ళి భగత్ సింగ్ విగ్రహనికి పూలమాలలు వేసి అనంతరం భగత్ సింగ్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వరకు వెళ్ళి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా టీయుడబ్ల్యుజె - ఐజెయు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్టుల కోసం వెజ్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. దేశ వ్యాప్తంగా అక్రిడిటేశన్ జర్నలిస్టులకు రైల్వే పాసులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద బాలాజీ, కోశాధికారి సిరిగాద ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్ బొబ్బిలి నర్సయ్య, ప్రమోద్ గౌడు, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శేఖర్, ఉపాధ్యక్షులు గోవిందరాజు సభ్యులు దేవదాస్, రవిబాబు, అక్రిడిటేశన్ కమిటీ సభ్యులు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.