Banner

జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

TUWJ-IJU జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక -హోరా హోరీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా సంజీవ్ - కార్యదర్శిగా అరవింద్ బాలాజీ --కోశాధికారిగా ప్రసాద్ ఘన విజయం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్ లో సోమవారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐజేయు) జిల్లా కార్యవర్గ నియామకానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షుడు, నగునూరి శేఖర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బుర్ర సంపత్ కుమార్ ఎన్నికల అధికారులుగా, మహేంద్ర చారి, రాజన్న సహాయ అధికారులుగా వ్యవహరించారు. జిల్లా కార్యవర్గ ఎన్నికకు ఆదివారం నామినేషన్లు స్వీకరించగా అధ్యక్ష, కోశాధికారి పదవులు మినహా మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. ఈ మేరకు సోమవారం అధ్యక్ష, కోశాధికారి పదవులకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ పోస్టు కోసం ఎడ్ల సంజీవ్, ప్రమోద్ గౌడ్, మురళి బరిలో నిలిచారు. ట్రెజరర్ పోస్టు కోసం సిరిగాద ప్రసాద్, కలిగోట సుదర్శన్ పోటీపడ్డారు. హోరా హోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టులు విచ్చేసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎట్టకేలకు ఎడ్ల సంజీవ్ 19 ఓట్ల మెజారిటీతో మురళి పై నూతన అధ్యక్షునిగా గెలుపొందారు. హోరాహోరీగా జరిగిన పోటీలో కోశాధికారిగా సిరిగాద ప్రసాద్ 71 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థికి 101 ఓట్లు రాగా sirigada ప్రసాద్ 172 ఓట్లు వచ్చాయి. ఎన్నికలు ముగిశాక ఎన్నికల అధికారిగా వ్యవహరించిన నగునూరి శేఖర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్యవర్గ వివరాలు: జిల్లా అధ్యక్షునిగా ఎడ్ల సంజీవ్, ఉపాధ్యక్షులుగా పొన్నాల చంద్రశేఖర్, సింగోజి దేవిదాస్, పెండ మహేందర్, పి.సంజీవ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా టి అరవింద్ బాలాజీ, సహాయ కార్యదర్శులుగా రాపెళ్లి రాజలింగం, అబ్దుల్ అజీమ్ పాష, మండే మోహన్, నీల నాగరాజు, కోశాధికారి గా సిరిగాద ప్రసాద్ నియమితులయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుండు నాగరాజు, బి ఆంజనేయులు, మల్లెపూల నరసయ్య, బొబ్బిలి దేవన్న, బండారి అరవింద్, కొట్టూరు సుదర్శన్, నాగేశ్వర్ రావు, దేవల్ రవిబాబు, యు. దశరథ్, ఎం.వెంకటేశ్వర్, గాదరి సంజీవరెడ్డి, ఎండి అన్వర్ పాషా, ఏ.యోగేశ్వర్, డి.రాకేష్, పి.నారాయణ,ఏ.విజయ్ గౌడ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Categories:

Calendar

Advertisements

Latest News